అమెరికాకు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. శరీరంలో ఉండాల్సిన వాటి కంటే ఎక్కువ అవయవాలతో పుట్టిన పిల్లలను మనం ఇంతకుమందు వార్తల్లో చూసే ఉంటాం. మూడు చేతులు, 11 వేళ్లు, రెండు తలలు.. ఇలా ప్రత్యేకంగా పుట్టిన పిల్లలు కొన్ని సార్లు పుట్టినప్పుడే మరణించినట్లు కూడా విన్నాం. ఇక్కడ మనం చెప్పుకోబోయే ఆ యువతి మాత్రం వారి కంటే భిన్నం. ఆ యువతికి రెండు జననాంగాలు. అవును.. 20 ఏళ్ల ఆ యువతికి రెండు జననాంగాలు, రెండు గర్భాశయాలు ఉన్నట్లు తన 18 వ ఏట తెలిసింది. ఆమెకు పీరియడ్లు కూడా నెలకు రెండు సార్లు పీరియడ్లు వస్తుంటాయట. ఈ సమస్య గురించి ట్రీట్ మెంట్ కోసం గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు అసలు నిజం బయటపడినట్లు ఆమె తెలిపింది.
పెయిజ్ డిఎంజెలో అనే అమెరికన్ యువతి ఉటెరెస్ డిడిల్పెజ్ అనే వింత సమస్యతో బాధపడుతోంది. తన హైస్కూల్ జీవితం అంతా రోజుల వ్యవధిలో వచ్చే పీరియడ్స్ వల్ల గడిచిపోయిందని, డాక్టర్ల దగ్గరకు వెళితే అసలు విషయం బయటపడిందని చెప్పింది. చాలా మంది తన శృంగార జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటారని , అయితే ఆ విషయంలో మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది. తనకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని, సన్నిహితంగా ఉన్నప్పుడు అంతా నార్మల్ గానే ఉంటుందని తెలిపింది. అయితే పిల్లల్ని పిల్లల్ని కనాలనుకుంటే మాత్రం డాక్టర్లు `సరోగసీ` విధానమే మేలని చెప్పినట్లు వివరించింది. ఈ స్థితి వల్ల ఆమెకు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉంటుందని చెప్పింది.
ఇదే సమస్యతో బాధపడుతున్న కొందరు ఫేస్‌బుక్ ద్వారా నాకు పరిచయమయ్యారు. ఓ మహిళకు ఐదు గర్భస్రావాల తర్వాత.. ప్రసవం అయింది. నాలాంటి సమస్యతోనే బాధపడుతూ పిల్లలకు జన్మనిచ్చిన మహిళల గురించి వింటూ ఆశతో జీవిస్తున్నానని పెయిజ్ తెలిపింది.
0 Comments