బాలీవుడ్ హాట్ బాంబ్ మల్లిక శెరావత్ ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చింది. తన 45వ పుట్టినరోజు నాడు టూపీస్ ఎల్లో బికినీలో హాట్ హాట్ దర్శనం ఇచ్చింది. Mallika sherawat సూపర్ హాట్ పిక్చర్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

ఓ దశాబ్దకాలం పాటు తన గ్లామర్ పరిశ్రమను ఏలింది మల్లిక. 2002 విడుదలైన జీనా సిర్ఫ్ మేరే లియే చిత్రంలో చిన్న పాత్ర చేసిన మల్లికా షెరావత్, క్వాహిష్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. విజయం సాధించగా... మల్లికాకు ఆఫర్స్ వరస కట్టాయి.

Mallika
కెరీర్ బిగినింగ్ నుండే మల్లిక గ్లామర్ రోల్స్ చేయడం జరిగింది. మర్డర్ చిత్రంతో మల్లిక ప్రభంజనం దేశవ్యాప్తం అయ్యింది. కుర్రకారు కలల రాణిగా ఆమె మారిపోయారు. బోల్డ్ రోల్స్ కి మల్లిక కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఆమె కోసమే బోల్డ్ కంటెంట్ తో అనేక మంది దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు.

మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో జాకీ చాన్ నటించిన భారీ యాక్షన్ ఎంటరైనర్ ది మిత్ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ చేశారు. అలాగే పాలిటిక్స్ ఆఫ్ లవ్, టైం రైడర్స్ అనే మరికొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించడం జరిగింది.

2012తరువాత మల్లికకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో ఆమె కొన్ని టీవీ సిరీస్ లు చేశారు. ది బ్యాచ్ లరేట్ ఇండియా, హవాయ్ ఫైవ్ జీరో అనే టెలివిజన్ షోలో ఆమె కనిపించారు. కొన్నాళ్లుగా మల్లికా పేరు మీడియాలో కూడా వినిపించడం తగ్గిపోయింది.

ఆర్థిక కష్టాల కారణంగా నివాసం ఉన్న ఇంటి అద్దెకూడా కట్టలేకపోయారన్న కథనాలు వినిపించాయి. ఇక సోషల్ యాక్టివిస్ట్ గా ఆడవాళ్ళ హక్కుల కోసం ఓ ఆర్గనైజేషన్ ద్వారా మల్లికా షెరావత్ పోరాడుతున్నారు. 2018 కేన్స్ ఫెస్టివల్ నందు ఫ్రీ ఏ గర్ల్ మూమెంట్ కి మద్దతుగా 12గంటలు పంజరంలో బందీగా ఉన్నారు.

ఇక మల్లిక వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె విమాన సంస్థలో పనిచేస్తున్న సమయంలో పైలట్ కరణ్ సింగ్ గిల్ ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. ఓ ఫ్రెంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారితో కూడా మల్లికా డేటింగ్ చేశారు.

45ఏళ్ల మల్లికాలో గ్లామర్ పవర్ ఏమాత్రం తగ్గలేదు. టీనేజ్ బేబీకి మాదిరి నాజూకైన శరీరం, మేని ఛాయ మైంటైన్ చేస్తున్నారు. ఎల్లో బికినీలో అందమైన శరీర వంపులు, సొంపులు చూపిస్తూ పూల్ పక్కన నాటీ ఫోజులతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వగా ఫోటోలు వైరల్ గా మారాయి.
0 Comments