Header Ads Widget

Responsive Advertisement

స్కిన్‌ టోన్‌ అందం సీక్రెట్‌ అడిగిన అభిమాని.. సాయిపల్లవి దిమ్మతిరిగే సమాధానం.. | sai-pallavi-mind-blowing-answer-to-netizen-who-asked-her-skin

  సాయిపల్లవి నేచులర్‌ బ్యూటీ. తన సహజమైన అందంతో, సహజమైన నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా సౌత్‌ లాంగ్వేజ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ ఐడెంటినీ సొంతం చేసుకుంది.

sai pallavi mind blowing answer to netizen who asked her skin glamoure

సాయిపల్లవి ఎనర్జీకి సీక్రెట్‌ ఏంటో ఇటీవల చెప్పింది. తాను జిమ్‌లో వ్యాయామాలు చేయనని, డాన్సు చేస్తానని తెలిపింది. ఓ అరగంట సేపు డాన్స్ చేస్తే బాడీ చాలా యాక్టీవ్‌ అవుతుందని, రెట్టింపు ఎనర్జీ వస్తుందని తెలిపింది సాయిపల్లవి. తాను హాట్‌ ఎక్సర్‌ సైజ్‌లు చేయనని, కేవలం డాన్సు చేసేందుకు ప్రయారిటీ ఇస్తానని తెలిపింది.

sai pallavi mind blowing answer to netizen who asked her skin glamoure

ఇప్పటి వరకు తాను జిమ్‌కి వెళ్లింది లేదట. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చిన్నపాటి వామప్‌లు చేస్తుందట. మంచి డాన్సు మ్యూజిక్‌ పెట్టుకుని స్టెప్పులేస్తానని తెలిపింది. దీంతోపాటు యోగా, మెడిటేషన్‌ చేస్తుందట. తనలోని నెగటివ్‌ ఎనర్జీని తరిమేయడానికి ఈ రెండు తనకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పింది సాయిపల్లవి.

 

sai pallavi mind blowing answer to netizen who asked her skin glamoure

అదే సమయంలో పర్‌ఫెక్ట్ డైట్‌ పాటిస్తుందట. మాంసం ముట్టదట. కేవలం వెజిటేరియన్స్ మాత్రమే తింటుందట. ఆకుకూరలు, కూరగాయలే ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. దీంతో ఫ్యాట్‌ లేకుండా ఉంటుందట, స్లిమ్‌గా, నాజూగ్గా ఉండేందుకు హెల్ప్ అవుతుందట. అంతేకాదు బాడీ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పింది.

 

sai pallavi mind blowing answer to netizen who asked her skin glamoure

అయితే ఈ క్రమంలో తాజాగా సోషల్‌ మీడియా ద్వారా ముచ్చటించింది సాయిపల్లవి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె నెటిజన్లతో చాట్‌ చేసింది. ఇందులో ఓ అభిమాని అందం కాపాడుకునేందుకు తీసుకునే జాగ్రత్తలేంటని ప్రశ్నించాడు. స్కిన్ టోన్, పొడవైన జుట్టును కాపాడుకునేందుకు ఏం చేస్తారని అడిగాడు. దానికి సాయిపల్లవి స్పందించింది. అదిరిపోయేలా సమాధానమిచ్చింది. ఆమె సమాధానానికి సదరు నెటిజన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.

sai pallavi mind blowing answer to netizen who asked her skin glamoure

ఇంతకి సాయిపల్లవి ఏం చెప్పిందంటే.. తాను వారానికి మూడ్రోజులు వ్యాయామం చేస్తుందట. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుందట. కూరగాయలు, పండ్లు తినేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందట. ఈ క్రమంలో తాను ఓ కొత్త విషయాన్ని తెలుసుకుందట. ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మానసికంగా ఒత్తిడిలో ఉంటే లాభం లేదని చెప్పింది. మానసికంగా ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని, వాటిపై దృష్టి పెట్టాలని చెప్పింది. మానసికంగా ఇబ్బంది పడుతూ ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎలాంటి ఫుడ్‌ తీసుకున్నా ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది సాయిపల్లవి.

sai pallavi mind blowing answer to netizen who asked her skin glamoure

మేకప్‌ లేకుండా కూడా సహజమైన అందంతో సిల్వర్‌ స్క్రీన్‌పై కనువిందు చేసే సాయిపల్లవి ఇటీవల `లవ్‌స్టోరి`తో సూపర్‌ హిట్‌ని అందుకుంది. నాగచైతన్యతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సాయిపల్లవి `విరాటపర్వం`, `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇవి విడుదలకు రెడీ అవుతున్నాయి.

Post a Comment

0 Comments