Header Ads Widget

Responsive Advertisement

నాన్న ఒత్తిడితోనే బాత్‌రూమ్‌ సీన్‌ చేశా.. నటి సన షాకింగ్‌ విషయం వెల్లడి

 టీవీ నటి సన షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. స్టార్‌ హీరోల సినిమాల్లో మదర్స్ రోల్స్ చేసి మెప్పించిన ఆమె మలయాళ సినిమాలో బోల్డ్‌ రోల్‌ చేసింది. అయితే ఆ సీన్‌ తన నాన్న ఒత్తిడితోనే చేసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. 

actress sana open about her bold bathroom scene arj

నటి సన తెలుగులో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఆమె అనేక సినిమాల్లో హీరోహీరోయిన్లకి తల్లిగా, అత్తగా, ఇతర కీలక పాత్రలు పోషించి మెప్పించారు. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

actress sana open about her bold bathroom scene arj

నటి సన మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చారు. ఎక్కువగా సపోర్టింగ్‌ రోల్స్ లో మెప్పిస్తున్న సనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన బోల్డ్ రోల్‌ గురించి చెప్పింది.

actress sana open about her bold bathroom scene arj

ఓ మలయాళ సినిమాలో తాను ఫస్ట్ టైమ్‌ బోల్డ్ రోల్‌ చేసింది. ఓ సినిమాలో హీరో తండ్రి కొడుకులుగా డ్యుయెల్‌ రోల్‌ చేశారని, అందులో తాను తండ్రికి భార్యగా నటించానని చెప్పింది.

actress sana open about her bold bathroom scene arj

అయితే ఓ సీన్‌లో భార్యపై ప్రేమని వ్యక్తం చేసే విషయంలో బాత్‌ రూమ్‌లో స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు తాను జస్ట్ టవల్‌ మాత్రమే కట్టుకుని ఉండాలని, అది చూసి హీరో తనని హగ్‌ చేసుకునే సీన్‌ ఉందట.

actress sana open about her bold bathroom scene arj

తనకు ఈ సీన్‌ చెప్పినప్పుడు టెన్షన్‌ పడిందట. తెలుగులో మంచి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే తనని తప్పుగా అనుకుంటారేమో అని ఇబ్బంది పడిందట.

actress sana open about her bold bathroom scene arj

ఈ విషయంలో తన తండ్రి సపోర్ట్ చేశారని, చిన్న సీనే కదా చేయమని ఒత్తిడి తెచ్చారట. నాన్న ఒత్తిడితోనే ఓ సీన్‌ చేశానని చెప్పింది సనా.

actress sana open about her bold bathroom scene arj

అది సెన్సేషన్‌ అయ్యిందట. కానీ ఏదైనా మన మంచికే అని పాజిటివ్‌గా తీసుకుంటానని చెప్పింది.

actress sana open about her bold bathroom scene arj

ఇంకా చెబుతూ, తనకు నటిగా ఎప్పుడు సంతృప్తి ఉందట. ఇంకా ఏదో చేయాలని ఉంటుందని, ఇంకా బాగా చేయాల్సిందని చెప్పింది. టీవీలో పాపులర్‌ నటి సమీర తన కోడలని చెప్పింది. తనకు కుమారుడు, కూతురు ఉన్నట్టు వెల్లడించింది.

actress sana open about her bold bathroom scene arj

`నిన్నే పెళ్లాడతా` చిత్రంతో నటిగా మారిన సనా.. `ఆవిడా మా ఆవిడా`, `సూర్యవంశం`, `ప్రేమంటే ఇదేరా`, `శ్రీ రాములయ్యా`, `కలిసుందాం రా`, `స్నేహమంటే ఇదేరా`, `భద్రాచలం`, `శివరామరాజు`, `మల్లీశ్వరీ`, `భద్ర`, `అతడు`, `పోలీస్‌ స్టోరీ 2`, `పాండురంగడు`, `తకిటతకిట`, `బృందావనం`, `శ్రీరామరాజ్యం`, `రెబల్‌`, `బలుపు`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`, `అ ఆ`, `మహర్షి` వంటి తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించింది.

actress sana open about her bold bathroom scene arj

టీవీ నటిగా కెరీర్‌ని ప్రారంభించి `జీవితం`, `చక్రవాకం`, `ఆది పరాశక్తి`, `సిరి సిరి మువ్వ`, `అరవింద సమేత` వంటి సీరియల్స్ లోనూ నటించింది.

actress sana open about her bold bathroom scene arj

నటి సన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిసి రెండు వందలకుపైగా చిత్రాల్లో నటించింది.

actress sana open about her bold bathroom scene arj

కరోనా వల్ల ఇబ్బంది పడ్డామని, ఎప్పుడు బిజీగా ఉండే తామకి కెరీర్‌ పరంగా బ్రేక్‌ వచ్చిందని చెబుతుంది సన.

Post a Comment

0 Comments