`ప్రేమ కావాలి` హీరోయిన్ ఇషా చావ్లా `బిగ్‌బాస్5` హౌజ్‌లోకి వెళ్లబోతుందని, కంటెస్టెంట్స్ గా ఎంపికైందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఈషా స్పందించింది.

బిగ్‌బాస్5 సందడి ఊపందుకుంది. ఇటీవల ప్రోమో బయటకు రావడంతో రియాలిటీ షో ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ కి తెరదీసింది. సెప్టెంబర్ 5 నుంచి ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగా హీరోయిన్ ఈషా చావ్లా కూడా రాబోతుందని మూడు రోజుల క్రితం ఓ వార్త వైరల్‌గా మారింది. గత సీజన్‌లో మోనాల్ గజ్జర్ సందడి చేసింది.
ఇప్పుడు `ప్రేమ కావాలి` హీరోయిన్ ఇషా చావ్లా రాబోతుందనే టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై ఈషా స్పందించింది. ఇన్‌స్టాలో ఈ అమ్మడు ఫాలోవర్లు బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు కురిపించారు. అందుకు స్పందిస్తూ తాను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈషాకి సంబంధించి వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.
2011లో `ప్రేమ కావాలి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ భామ `పూలరంగడు`, `శ్రీమన్నారాయణ`, `మిస్టర్ పెళ్లికొడుకు`, `జంప్ జిలానీ` చిత్రాల్లో నటించింది. అన్నీ చిన్న సినిమాలే కావడం, ఆయా చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఇప్పుడు ఫేడౌట్ అయ్యింది. గత ఐదేళ్లుగా సినిమాలకు దూరమయ్యింది ఈషా.
0 Comments