తగ్గిన బరువు కంట్రోల్ లో ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. అయితే.. సులభంగా బరువు తగ్గేందుకు ఆహారంతోపాటు.. వ్యాయామంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే.. బరువు కంట్రోల్ లో ఉంటుంది.
weight loss
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. ఈ బరువు తగ్గించుకునే క్రమంలో.. చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తిండి తగ్గించేస్తుంటారు... కొందరు గంటల కొద్దీ వ్యాయామం చేస్తుంటారు. లేదంటే.. ఇంకేదో... ఇంకేదో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. ఎంత బరువు తగ్గుతున్నారనే విషయం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
weight loss
ఆరోగ్యంగా ఉండేందుకు బరువు తగ్గడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ.. ఆ బరువు తగ్గడం కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి. అంతేకాదు.. సులభంగా బరువు తగ్గి.. మళ్లీ వెంటనే బరువు పెరగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. తగ్గిన బరువు కంట్రోల్ లో ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. అయితే.. సులభంగా బరువు తగ్గేందుకు ఆహారంతోపాటు.. వ్యాయామంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే.. బరువు కంట్రోల్ లో ఉంటుంది.
weight loss
ఆకస్మికంగా బరువు పెరగడం.. అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ శరీరంలోని హార్మోన్ల ప్రభావం కారణంగా కూడా.. బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే.. ఈ రోజుల్లో సరైన ఆకృతి కోసం కూడా చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటున్నారు. దాని కోసం క్రాష్ డైట్ లు, నిపుణుల సలహాలు లేకుండా.. వ్యాయామం చేయడం లాంటివి చేస్తున్నారు.
పరిమిత కాల వ్యవధిలో బరువు లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఇవన్నీ చేస్తారు, అయినప్పటికీ, ఆధునిక జీవనశైలితో ఇది సవాలుగా మారుతుంది. అయితే.. తగ్గిన బరువు మాత్రం.. అదే విధంగా కంటిన్యూ అవ్వడం లేదు.. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిపోతున్నారు.
weight loss
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి ఏదైనా కొనసాగించే ముందు నిపుణుడి నుండి సరైన మార్గదర్శకత్వం పొందడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అంటే.. వారానికి 400 గ్రాముల నుంచి కేవలం కేజీ మధ్యలోనే బరువు తగ్గాలట. అంతకన్నా ఎక్కువ బరువు చాలా తక్కువ సమయంలో తగ్గితే.. అది ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదని సూచిస్తున్నారు.
ఆహారం మంచిగా తీసుకోవడంతోపాటు.. ఒత్తిడి తగ్గించుకొని మంచి నిద్రపోవాలట. అంతేకాకుండా ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ కూడా చేయాలట. ఇవి చేస్తూ బరువు తగ్గించుకుంటే.. ఆరోగ్యం మీ సొంతమౌతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. కెఫీన్ ఎక్కువగా ఆహారాలను కూడా పూర్తిగా మానేయాలి. జంక్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మీరు అర్థరాత్రి అతిగా తినడం అలవాటు చేసుకుంటే ముందుగానే రాత్రి భోజనానికి దూరంగా ఉండండి. ఇక చాలా మంది కొవ్వు పూర్తిగా లేని ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
0 Comments