Header Ads Widget

Responsive Advertisement

డార్లింగ్‌కి అనుష్క స్వీట్‌ బర్త్ డే విషెస్‌.. సెలబ్రిటీల ట్వీట్లు | anushka-sent-sweet-birthday-wishes-to-prabhas-and-also-many-celabraties-wished

 ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు విషెస్‌ తెలియజేస్తున్నారు. హీరోలు,దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇలా అందరు డార్లింగ్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో అనుష్క విషెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

anushka sent sweet birthday wishes to prabhas and also many celabraties wished him

డార్లింగ్ ప్రభాస్‌ పుట్టిన రోజు ఓ ఫెస్టివల్‌గా మారింది. అభిమానులు ఆయన బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ని ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ చేస్తున్నారు. మంచి మనుసున్న ప్రభాస్‌ చిత్ర పరిశ్రమ ఓ అజాత శత్రువుగా రాణిస్తున్నారు. అందుకే ఆయనకు అన్ని వర్గాల నుంచి పుట్టిన రోజు విషెస్‌లు వెల్లువల వస్తున్నాయి. అందులో భాగంగా ప్రభాస్‌కి స్పెషల్‌ పర్సన్‌ అయిన స్వీటి అనుష్క బర్త్ డే విషెస్‌ చెప్పింది. 

`పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రభాస్‌. జీవితంలో మీకు అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా. మీ కథలన్నీ ఎంతో మంది హృదయాలకు చేరువ కావాలని,  సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా` అని తెలిపింది అనుష్క. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేసింది. 

వీరితోపాటు యంగ్‌ హీరో సత్యదేవ్‌, దర్శకుడు బివిఎస్‌ రవి, హీరో రవితేజ, నవీన్‌ పొలిశెట్టి, శ్రీనువైట్ల, గుణశేఖర్‌, గోపీ మోహన్‌ ఇలా అనేక మంది తారలు, ప్రొడక్షన్‌ కంపెనీలు, దర్శకులు, నిర్మాతలు ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ప్రభాస్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి ట్రెండింగ్‌ అవడంతోపాటు హ్యాపీ బర్త్ డే ప్రభాస్‌ యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. 

          

ప్రభాస్‌ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా `రాధేశ్యామ్‌` విడుదలకు రెడీ అవుతుంది. బర్త్ డే సందర్భంగా శనివారం విడుదల చేసిన టీజర్‌ ట్రెండ్‌ అవుతుంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు `సలార్‌`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్‌` చిత్రాలు చేస్తున్నారు. ఇలా దాదాపు మూడేళ్ల వరకు ఫుల్‌ బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. 

Post a Comment

0 Comments