Header Ads Widget

Responsive Advertisement

సంచలన నటి పాయల్‌ ఘోష్‌పై దుండగుల దాడి.. గాయాలు.. యాసిడ్‌ దాడికి యత్నం?

 దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌(anurag kashyap)పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం సృష్టించింది పాయల్‌ (payal ghosh). దీంతో ఆ మధ్య బాగా వార్తల్లో నిలిచింది పాయల్‌ ఘోష్‌. అయితే తాను మెడికల్‌ షాప్‌ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా, దాడి(attack)కి గురైనట్టు తెలిపింది. 

actress payal ghosh acid attacked by masked men injured
Author
Hyderabad, First Published Sep 21, 2021, 4:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నటి పాయల్‌ ఘోష్‌పై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆమెని రాడ్‌తో కొట్టారు. అంతేకాదు యాసిడ్‌ దాడికి యత్నించారట. తాజాగా ఈ విషయాన్ని పాయల్‌ ఘోష్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా పాయల్‌ సోషల్‌ మీడియాలో గాయపడిన ఫోటోని పంచుకుంటూ తాను దాడికి గురైనట్టు వెల్లడించింది. తనపై కొందరు యాసిడ్‌ దాడికి యత్నించారని పేర్కొంది. 

దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం సృష్టించింది పాయల్‌. దీంతో ఆ మధ్య బాగా వార్తల్లో నిలిచింది పాయల్‌ ఘోష్‌. అయితే తాను మెడికల్‌ షాప్‌ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా, దాడికి గురైనట్టు తెలిపింది. ముసుగు ధరించిన ఉన్న వ్యక్తులు తనపై యాసిడ్‌ దాడి చేశారని పేర్కొంది. `నేను పాయల్‌ ఘోష్‌. నిన్న మెడిసిన్‌ కొనడానికి బయలుదేరాను. నేను నా కారు డ్రైవర్‌ సీట్లో కూర్చోవడానికి ప్రయత్నించగా, కొంత మంది వచ్చి నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు.

`వారి చేతిలో బాటిల్‌ ఉంది. అది ఏంటో నాకు తెలియదు. బహుశా అది యాసిడ్‌ కావచ్చు. లేదా మరేదైనా కావచ్చు. వారు నన్ను రాడ్‌తో కొట్టడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలో నన్ను నేను రక్షించుకునేందుకు ప్రయత్నించాను. గట్టిగా అరిచాను. అయితే అప్పటికే వాళ్లు రాడ్‌తో కొట్టారు. దీంతో నా ఎడమ చేతికి గాయమైంది. నేను గట్టిగా అరవడంతో వాళ్లు పారిపోయారు. ఇప్పుడు నేను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌ వెళ్తున్నా. నీ జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. ముంబయిలో నేను ఇలాంటి ఘటన మొదటి సారి ఎదుర్కొన్నా` అని తెలిపింది పాయల్‌ ఘోష్‌. 

అంతేకాదు ఈ సందర్భంగా గాయంతో ఉన్న ఫోటోని పంచుకుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ `నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను. నొప్పి కారణంగా` అని పేర్కొంది. 2009లో వచ్చిన `ప్రయాణం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్‌ భామ ఆ తర్వాత ఎన్టీఆర్‌ `ఊసరవెల్లి`, `మిస్టర్‌ రాస్కెల్‌` వంటి చిత్రాల్లో నటించింది. కన్నడ చిత్రంలోనూ నటించింది. హిందీలో `పటేల్ కి పంజాబి షాడీ` నటించగా, ఇప్పుడు `కోయి నానేనా` చిత్రంలో నటిస్తుంది.
 

Post a Comment

0 Comments