Header Ads Widget

Responsive Advertisement

బాలయ్యతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన మెహరీన్‌

mehreen clarity on rumors act with balakrishna next movie arj

 ఇప్పటికే జరగాల్సి ఉండగా, కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెహరీన్‌ మళ్లీ సినిమాలకు కమిట్‌ అవుతుందని, తెలుగులో బాలకృష్ణ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. 

Author
పంజాబీ భామ మెహరీన్‌ ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అవుతుంది. ఆమె హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. త్వరలోనే మ్యారేజ్‌ జరగబోతుంది. ఇప్పటికే జరగాల్సి ఉండగా, కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెహరీన్‌ మళ్లీ సినిమాలకు కమిట్‌ అవుతుందని, తెలుగులో బాలకృష్ణ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. 

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన నెక్ట్స్ సినిమాని చేయబోతున్నారు. ఇందులో మీనా కీలక పాత్రపోషిస్తుందని, హీరోయిన్‌ మెహరీన్‌తో చర్చలు జరుపుతున్నారని టాక్. కానీ ఇందులో వాస్తవం లేదని తెలిపింది మెహరీన్‌. తాజాగా తనపై వస్తోన్న రూమర్స్ పై ఆమె స్పందిస్తూ, తాను కొత్త సినిమాకి కమిట్‌ అయితే అధికారికంగా వెల్లడిస్తానని తెలిపింది. రూమర్స్ ని నమ్మవద్దని తెలిపింది. మారుతి రూపొందిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు చెప్పింది. అలాగే `ఎఫ్‌3`లో బిజీగా ఉన్నట్టు వెల్లడించింది. ఇన్‌డైరెక్ట్ గా బాలయ్యకి నో చెప్పిందీ అందాల హనీ(ఎఫ్‌2లో పాత్ర పేరు). 

Post a Comment

0 Comments