అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. కవ్వించే కళ్ళు, కైపెక్కించే ఒళ్ళుతో, కుర్రకారుకు నిద్ర దూరం చేస్తుంది.

బాలీవుడ్ లో జాన్వీ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఆమె నాలుగైదు చిత్రాల వరకు చేశారు. అయితే ఒక్క చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. నటిగా మాత్రం జాన్వీకి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేశారు ప్రేక్షకులు.

ముఖ్యంగా జాన్వీ అందంలో దేవకన్య అంటూ పొగిడేస్తున్నారు. 2018లో విడుదలైన ధఢక్ జాన్వీ మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కూతురును వెండి తెరపై చూసి మురిసిపోవాలని శ్రీదేవి అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.

కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.

ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ షో విషయంలో వెనుకాడ కూడదు. జాన్వీ సైతం అదే పద్దతి ఫాలో అవుతున్నారు. బికినీలు, పొట్టి డ్రెస్ లలో ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.

తాజాగా స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ ఫోజులిచ్చింది. శరీర రంగులో కలిసిపోతున్న ఆమె డ్రెస్, జాన్వీ అందాలు మరింత మెరిసిపోయేలా చేసింది. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
0 Comments