Header Ads Widget

Responsive Advertisement

నైట్ పార్టీలో పూజా హెగ్డే చిందులు, ఎదురుగా ఖాళీ మద్యం బాటిళ్లు, ఫ్యాన్స్ కి సారీ చెప్పిన హాట్ బ్యూటీ

 హాట్ ట్రెండీ డ్రెస్ ధరించి ఉన్న పూజా హెగ్డే నైట్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఖాళీ మద్యం బాటిళ్లు ఉండగా, మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించాలి, అంటూ కామెంట్ చేశారు. 

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

టాలీవుడ్ టాప్ హీరోయిన్ హోదా దక్కించుకున్న పూజా హెగ్డే, అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూజా చేతిలో ఉన్నన్ని బడా ఆఫర్స్ మరో హీరోయిన్ ఎవరికీ లేవు. ఒకప్పుడు సరైన హిట్ లేక సతమతమైన పూజాకు ఇలాంటి క్రేజీ ఆఫర్స్ రావడం నిజంగా ఆమె లక్ అని చెప్పాలి. 
 
pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

తెలుగు, తమిళంలో ఆమె భారీ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేస్తున్న పూజా, మరో భారీ చిత్రం ఆచార్యలో అవకాశం దక్కించుకున్నారు. 

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చరణ్ తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది. అలాగే యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చేస్తున్నారు. 

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన బీస్ట్ మూవీలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ పట్టేసింది పూజా. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న బీస్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

మహేష్ -త్రివిక్రమ్ చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ చిత్రాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట. దర్శక నిర్మాతలు ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం పూజానే సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. 

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

కాగా పూజా హెగ్డే లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. దానికి కారణం సదరు ఫొటోతో పాటు ఆమె చేసిన కామెంట్. హాట్ ట్రెండీ వేర్ ధరించి ఉన్న పూజా డాన్స్ చేస్తున్న ఫోటో షేర్ చేశారు. 

pooja hegde dances and enjoys night party says she is sober and sorry to disappointing

నైట్ పార్టీలో నాతో నేనే డాన్స్ చేస్తున్నాను. అయితే మీరు అనుకుంటున్నట్లు నేను మద్యం మత్తులో లేను. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించాలి. మైమరచి ఆడడానికి మత్తుపానీయాలు అవసరం లేదని, ఆమె కామెంట్ రూపంలో వివరణ ఇచ్చారు. ఇక పూజా హెగ్డే పోస్ట్ వైరల్ గా మారింది.

Post a Comment

0 Comments